యూఎస్ మార్కెట్ లో ‘కుబేర’ సాలిడ్ వసూళ్లు.. 2 మిలియన్ దిశగా!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కుబేర”. ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ అదరగొడుతుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో భారీ వసూళ్లు కుబేర సొంతం చేసుకుంటూ ధనుష్ కెరీర్లోనే మరో సాలిడ్ హిట్ గా నిలిచింది.

అయితే యూఎస్ మార్కెట్ లో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం 1.9 మిలియన్ డాలర్స్ మార్క్ దగ్గరకి వెళుతున్న ఈ సినిమా ఇంకొంత సమయంలోనే 2 మిలియన్ ని క్రాస్ చేసేస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఇది మరింత ఎక్కువ లెక్క దగ్గరే ఆగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ విలన్ గా నటించగా రష్మిక మందన్నా కింగ్ నాగార్జునలు సాలిడ్ పాత్రల్లో నటించారు.

Exit mobile version