నైజాంలో ఐదో రోజు ‘కుబేర’ సాలిడ్ వసూళ్లు.. మొత్తం ఎంతంటే!

నైజాంలో ఐదో రోజు ‘కుబేర’ సాలిడ్ వసూళ్లు.. మొత్తం ఎంతంటే!

Published on Jun 25, 2025 2:05 PM IST

కోలీవుడ్ గ్లోబల్ స్టార్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా, కింగ్ నాగార్జున కలయికలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ధనుష్ కెరీర్లోనే మంచి వసూళ్లు అందుకున్న సినిమాగా వెళుతుంది. అయితే నైజాం మార్కెట్ లో కుబేర సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుంది.

మొత్తం 5 రోజుల్లో 12 కోట్ల మేర షేర్ ని ఈ సినిమా రాబట్టడం అనేది విశేషం. డే 5 కి 99 లక్షల షేర్ (జీఎస్టీ) కలిపి అందుకున్నట్టు పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో కుబేర రన్ ఎలా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు