తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోన్న క్రమంలో కరోనా పై అవగాహన కలిగించేందుకు ఇవాళ హైదరాబాద్ లోని పలు కంటైన్మెంట్ జోన్లలో మంత్రులు, ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా పలు చోట్ల ప్రజలతో మాట్లాడిన కేటీఆర్.. కరోనా పై జాగ్రత్తలు చెప్పారు. ఈ క్రమంలో ఓ చోట బాలుడితో పాటు సినిమాలో రామ్ చరణ్ తెలుసా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేటీఆర్ ఓ బాలుడి గురించి అడుగుతూ.. ఆమె తల్లితో ‘‘మీ కొడుకా? ఏం పేరు’’ అని ప్రశ్నించారు. దానికి ఆ బాలుడు నా పేరు రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో కేటీఆర్ ఆ బాలుడితో ‘ఆ రామ్ చరణ్ తెలుసా..? సినిమాల్లోని రామ్ చరణ్ తెలుసా నీకు..’ అని సరదాగా కేటీఆర్ అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
#KTR interaction with people making awareness #StayHome till May3#lockdown pic.twitter.com/4nRze9umPp
— Sai Kumar Reddy ???????? (@_saikumarreddy) April 16, 2020