నాకు ఆ గుర్తింపు చాలు – కృతి సనన్

kriti-sanon

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి క్రేజ్ రావాలి అంటే తను నటించిన సినిమా పెద్ద హిట్ అన్నా అవ్వాలి లేదా ఓ స్టార్ హీరో సినిమాలో చాన్స్ అన్నా కొట్టేయాలి. అలా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసింది ముంబై బ్యూటీ కృతి సనన్. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘1-నేనొక్కడినే’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

తాజాగా మీడియా మిత్రులతో కృతి సనన్ మాట్లాడుతూ ‘1 సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. తొలి సినిమాతో ఇంత మంచి అవకాశం రావడం నా అదృష్టం. తెలుగు రాకపోయినా ధైర్యంగా నటించాను. చిత్ర బృందం కూడా నన్ను చిన్నపిల్లలా చూసుకొని ప్రోత్సహించారు. మహేష్ బాబుతో నటిస్తానని అస్సలు అనుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తు పడుతున్నారు, మహేష్ హీరోయిన్ మహేష్ హీరోయిన్ అని అంటున్నారు. ఆ గుర్తింపు నాకు చాలని’ చెప్పింది.

Exit mobile version