‘చండీ’లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న కృష్ణంరాజు

First Posted at 14:38 on Apr 16th

Krishnam-Raju---Chandee
విలక్షణ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘చండీ’ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కృష్ణంరాజు ఊరి పెద్దగా, ఫ్రీడం ఫైటర్ గా, ప్రియమణికి తండ్రీగా కనిపించనున్నారు. సముద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీనుబాబు నిర్మిస్తున్నాడు, ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఈ మధ్యే ముగిసింది. దీనిలోని పాటని ఈ నెల 17నుండి షూట్ చేయనున్నారు. డైరెక్టర్ సముద్ర కృష్ణంరాజు పాత్ర గురించి మాట్లాడుతూ ఇది రెబల్ అభిమానులందరికి చాలా బాగా నచ్చుతుంది అని అన్నాడు. ఎస్.ఆర్ శంకర్, చిన్నలు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి వాసు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా, ఆశిష్ విద్యార్ధి, వినోద్ కుమార్, నాగబాబు మొదలగువారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version