కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ సినిమా

కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ సినిమా

Published on Jun 12, 2013 5:30 PM IST

krishnam-raju-and-prabhas

రెబల్ స్టార్ కృష్ణంరాజు దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్నాడు. వీరిద్దరూ కలిసి గతంలో పని చేశారు కానీ ఈసారి చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు. ప్రభాస్ సినిమాకి కృష్ణంరాజు గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని విలక్షణ నటుడుకృష్ణంరాజు గారు విజయవాడలో మీడియాకు తెలియజేశారు. ‘నేను ప్రబాస్ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాను. ఈ సినిమా ఆగష్టులో ప్రారంభం అవుతుంది’ అని అన్నాడు. అలాగే కృష్ణంరాజు గారు ప్రభాస్ పెళ్లి విషయాన్ని కూడా తెలియజేశారు. ‘ ప్రభాస్ వచ్చే సంవత్సరం ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రబాస్ పెళ్లి తప్పకుండ 2014లో జరుగుతుంది’. అన్నారు. ఈ పెళ్లి గురించి ఇతర ఏ వివరాలను ఆయన తెలియజేయలేదు. ఈ విషయం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ప్రభాస్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడు. మిగిలిన వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు