వెంకీని అభినందించిన సూపర్ స్టార్

వెంకీని అభినందించిన సూపర్ స్టార్

Published on Jan 14, 2013 6:30 PM IST

Venkatesh

విక్టరీ వెంకటేష్ పెద్దోడుగా, సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నోడుగా నటించిన సినిమా ‘సేతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. బయటవారు పిలవడానికి చిన్నోడు, పెద్దోడు కానీ వారు పిలుచుకునేది మాత్రం ఏరా రే, ఒరే అనే అనుకుంటారు, కానీ ఈ కెమిస్ట్రీ సినిమాలో బాగుంటుంది. సినిమా సక్సెస్ అందుకోవడంతో వెంకటేష్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘ సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ సినిమా చూసి సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు ఫోన్ చేసి సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా చేసావు. అన్నదమ్ములుగా మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. చూడటానికి నిజమిన అన్నదమ్ములు లానే ఉన్నారని ఆయన అభినందించారు. సెట్స్ లోకూడా మమ్మల్ని అలానే అనేవారని’ వెంకటేష్ అన్నారు.

తాజా వార్తలు