‘వీరమల్లు’ మిస్.. కానీ నెక్స్ట్ టైం గ్యారెంటీ అంటున్న దర్శకుడు!

krish-jagarlamudi-pawan-kal

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన భారీ హిస్టారికల్ చిత్రమే “హరిహర వీరమల్లు”. నిజానికి ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, తన కథ కథనాలతో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత తాను మధ్యలో తన వ్యక్తిగత కారణాలు రీత్యా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో మిస్ చేసుకోవడంపై క్రిష్ ఒకింత బాధగానే ఉన్నట్టు తెలిపారు.

కానీ భవిష్యత్తులో మాత్రం పవన్ కళ్యాణ్ తో తప్పకుండా మరో సినిమా చేస్తానని గ్యారెంటీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా తన ఘాటి ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ విషయం రివీల్ చేశారు. ఎప్పటికైనా మరో మంచి కథని పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసి సినిమా చేస్తానని చెబుతున్నారు. దీనితో వీరమల్లు కి మిస్ అయ్యిన ట్రీట్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఘాటి ఈ సెప్టెంబర్ 5న రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version