ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘కన్నప్ప’

టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు సాలిడ్ హైప్ క్రియేట్ అయ్యింది.

అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత పలు కారణాల వల్ల అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా యావరేజ్‌గా ఉండటంతో ఈ సినిమాను ఓటీటీలో చూద్దామని చాలా మంది ప్రేక్షకులు భావించారు. కానీ, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించేందుకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా నేటి(సెప్టెంబర్ 4) నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. భారీ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version