ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!

Kannappa

మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన భక్తి పారవశ్య చిత్రమే “కన్నప్ప”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్ అలాగే మోహన్ లాల్ ఇంకా కాజల్ లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఫైనల్ గా మొన్ననే ఓటీటీ డేట్ ని కూడా అనౌన్స్ చేసుకుంది.

స్వయంగా విష్ణునే నేడు ఆగస్ట్ 4 నుంచి సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ గా నేడు 4వ తేదీ వచ్చినప్పటికీ కన్నప్ప సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాలేదు. దీనితో కారణం ఏమై ఉంటుంది అని ఓటీటీ వీక్షకులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

Exit mobile version