టాలీవుడ్‌లో కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నారు నిర్మాత ప్రవీణ పరుచూరి. ఇక ఆమె రీసెంట్‌గా డైరెక్టర్‌గా మారి చేసిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. జూలై 19న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి మార్కులు సాధించింది. ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనిక హీరోహీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ చిత్రాన్ని ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ సినిమాను ప్రవీణ పరుచూరితో పాటు రానా దగ్గుబాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.