విషాదం: ప్రముఖ నటుడి సతీమణి మృతి !

kota-srinivasa--rao-wife-pa

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి నేడు కన్నుమూశారు. కోట శ్రీనివాసరావుకి రుక్మిణికి మధ్య మంచి అనుబంధం ఉంది. కోట శ్రీనివాసరావు జులై 13న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన ఇకలేరన్న వార్త మరువక ముందే, కోట సతీమణి మృతి చెందడం బాధాకరమైన విషయం.

కోట కుటుంబ సభ్యులతో పాటు, అందరినీ కలచివేస్తోంది. కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కారణంగానే కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని.. కోట తన నట జీవితంలో పడి కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేకపోయానని అనేకసార్లు పంచుకున్నారు. తన పిల్లలు చిన్నతనంలో అచ్చటా ముచ్చట పెద్దగా చూసుకుంది లేదని, తన భార్య చూసుకున్నారని కోట గతంలో తెలిపారు.

మా 123తెలుగు.కామ్ తరఫున రుక్మిణి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Exit mobile version