బన్నీ నిర్ణయానికి నో అంటున్న కొరటాల..ఎందుకు?


ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో మొదటిది సుకుమార్ తో చేస్తున్న పుష్ప కాగా మరోటి కొరటాల శివతో. ఇంకా పుష్ప లైన్ లో ఉండగానే ఈ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసేసి బన్నీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇప్పుడు బన్నీ మరియు కొరటాల కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి లేటెస్ట్ టాక్ ఒకటి తెలుస్తుంది. బన్నీ కొరటాలకు చెప్పిన ఓ అంశానికి కొరటాల నో చెప్పారట.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఎలాగో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తీస్తున్నాం కాబట్టి ఈ చిత్రాన్ని ఒక హిందీ చిత్రంలా తీయమని సూచించారట. కానీ అందుకు కొరటాల కుదరదని చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చిత్రం కథ ప్రకారం మన దక్షినాదికి చెందిన సున్నితమైన అంశాలు కలిగినది అని అందువల్ల మార్చడం కుదరని చెప్పేశారట. ప్రస్తుతం వారికి ఈ విధమైన టాపిక్ నడిచినట్టు తెలుస్తుంది. మరి ఏఈ చిత్రం ఎలా ఉండనుందో చూడాలి.

Exit mobile version