షార్ట్ ఫిల్మ్ తీయనున్న కోన వెంకట్

షార్ట్ ఫిల్మ్ తీయనున్న కోన వెంకట్

Published on Jul 12, 2013 5:53 AM IST

Kona-Venkat
సీనియర్ రచయిత కోన వెంకట్ త్వరలో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి సిద్దమవుతున్నాడని సమాచారం. దానికోసం ఆయన 20 నుండి 30 సంవత్సరాల మద్య వయసున్న నటినటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వీరితో ఈ నెల 18 నుండి న్యూయార్క్ లో షూటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సినిమాని లాఫింగ్ బుద్ద ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వంశీ మాదిరాజు, రామ్ గోలి కలిసి నిర్మిస్తున్నారు. ఈయన ఈ మద్య విడుదలైన బలుపు సినిమాకి మాటలను అందించిన విషయం తెలిసిందే. అలాగే ఈ మద్య డల్లాస్ లో జరిగిన నాట్స్ ఉత్సవాలలో ఆయన ‘థాట్ టు థియేటర్’ స్క్రీన్ రైటింగ్ అనే వర్క్ షాప్ ని కూడా నిర్వహించాడు.

తాజా వార్తలు