జక్కన్నకు భీం స్పెషల్ విషెష్.!

జక్కన్నకు భీం స్పెషల్ విషెష్.!

Published on Oct 10, 2020 10:59 AM IST

ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీతో పాటుగా మొత్తం దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి జన్మదినం సందర్భంగా దేశీయ అగ్ర నటులు ఇతర దర్శకులు సహా మరెంతో మంది శుభాకాంక్షలు తెలియజేసారు. అదే బాటలో రాజమౌళికి అత్యంత ఆప్తుడు మరియు మన టాలీవుడ్ అగ్ర నటుడు అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్పెషల్ విషెష్ ను తెలియజేసారు.

“పుట్టినరోజు శుభాకాంక్షలు జక్కన్న, లవ్ యు” అంటూ వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన అభిమానాన్ని ప్రేమను వ్యక్తం చేసారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” చిత్రంలో కొమరం భీం లుక్ లో కనిపించనున్న తారక్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి జక్కన్న ఇచ్చే ట్రీట్ కోసం ఇంకో పన్నెండు రోజులు ఆగక తప్పదు.

తాజా వార్తలు