First Posted at 12.40 on Apr 18th
‘చిన్న సినిమా’ లో కోమల్ ఝా నర్తకిగా కనిపించి అందరినీ ఎంటర్టైన్ చెయ్యనుంది. ఈ సినిమాలో ఆమె కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించనుందని డైరెక్టర్ ఏ.కే. కంభంపాటి తెలియజేశారు. కోమల్ ఝా వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1950 బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలకానుంది. శేఖర్ నిర్మించిన ఈ సినిమా ద్వారా అర్జున్ కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, విలక్షణ నటుడు బాలయ్య, ఎల్. బి. శ్రీరామ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. సోషల్ నెట్ వర్క్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ ల ప్రమోషన్ ద్వారా స్టూడెంట్స్, యూత్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది.