మరోసారి భక్తిరసాత్మక చిత్రంతో రానున్న కోడి రామకృష్ణ

మరోసారి భక్తిరసాత్మక చిత్రంతో రానున్న కోడి రామకృష్ణ

Published on Apr 30, 2013 11:59 PM IST

kodiramakrshna
‘అమ్మోరు’, ‘దేవి’ మరియు ‘దేవుళ్ళు’ మొదలగు సినిమాల తీసిన కోడి రామకృష్ణ మరోసారి మరో దేవాత్మక సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పేరు ‘అవతారం’. అరుంధతి ఆర్ట్స్ బ్యానర్ పై యుగంధర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నాడు. కన్నడ నటి రాధిక పండిట్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. భానుప్రియ, రిషి వంటి తారలు కుడా ఈ సినిమాలో పాలుపంచుకున్నారు.

ఈ సినిమా గురించి కోడి రామకృష్ణ మాట్లాడుతూ “ఈ సినిమా నేపధ్యం ఈ చిత్రం యొక్క పేరే చెబుతుంది. ‘అవతారం’ అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపచేస్తుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. గాంధీ కృష్ణ అందించిన సంగీతం ప్రధాన బలం. జొన్నవిత్తుల అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమా రాధిక పండిట్ కు చాలా చాలా నచ్చేయడంతో కన్నడలో ఆమె విడుదల చేసుకుంటుందని”తెలిపారు. శరణు కోరి వచ్చిన భక్తుల కష్టాలను తీర్చడానికి దేవుళ్ళు, దేవతలు సైతం కష్టాలు పడతారన్న అంశం చుట్టూ తిరిగే కధ. ఈ సినిమాలో విసువల్ ఎఫ్ఫెక్ట్స్ కు పెద్దపీట వేసారు. శ్రీ వెంకట్ సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు