‘కో అంటే కోటి’ విడుదల తేదీ ఖరారు

‘కో అంటే కోటి’ విడుదల తేదీ ఖరారు

Published on Dec 19, 2012 4:00 PM IST

KO-ANTEY-KOTI-(3)
వైవిధ్యమైన సినిమాలు చేసే యంగ్ హీరో శర్వానంద్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కో అంటే కోటి’ సినిమా డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు శ్రీ హరి ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ‘ఆవకాయ్ బిర్యాని’ ఫేం అనీష్ కురువిల్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని శర్వానంద్ స్వయంగా తన సొంత బ్యానర్ శర్వా ఆర్ట్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలై యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు