IPL 2025 : చెన్నైపై కోల్‌కతా గ్రాండ్ విక్టరీ

IPL 2025 : చెన్నైపై కోల్‌కతా గ్రాండ్ విక్టరీ

Published on Apr 11, 2025 11:05 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన చెన్న సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వన్ సైడ్‌గా సాగింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై ఏ దశలోనూ పోరాడినట్లుగా కనిపించలేదు. విజయ్ శంకర్(29), శివమ్ దూబె(31 నాటౌట్) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా కనీస పోరాటం చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 9 వికెట్ల నష్టానికి కవలం 109 పరుగులు మాత్రమే చేశారు.

ఇక 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా కేవలం 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. క్వింటాన్ డికాక్(23), సునీల్ నరైన్(44), అజింక్య రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) అలవోకగా లక్ష్యాన్ని చేధించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రౌడర్స్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.

తాజా వార్తలు