టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘కిష్కింధపురి’ కూడా ఒకటి. హారర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా పై సాలిడ్ అంచనాలు పెంచింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ కేవలం పెద్ద వారికే అని ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేసింది. హారర్ ఎలిమెంట్స్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
అయితే, ఈ సినిమా లో ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ ఈ నిర్ణయం తీసుకోవడం తో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది.