మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కన్నప్ప”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో అనేకమంది స్టార్స్ ఈ సినిమాలో నటించగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ ని అయితే అందుకుంది.
మరి ఈ చిత్రం అక్కడ నుంచి దాదాపు రెండు నెలల తర్వాత అయితే ఓటిటిలో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనితో మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి స్టీఫెన్ సంగీతం అందించగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు నటించగా మోహన్ బాబు నిర్మాణం వహించారు.
Thank you for your love ❤️ pic.twitter.com/9kBZ6ArWfn
— Vishnu Manchu (@iVishnuManchu) September 5, 2025