యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్”. గట్టి అంచనాలు ఉన్న ఈ సినిమాకి ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ చేస్తున్నారు. మరి ఈ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ఆడియెన్స్ కోసం గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇపుడు సిద్ధం అవుతుంది.
ఇక ఇందుకు డేట్ ని అలాగే వేదికని మేకర్స్ ఇపుడు రివీల్ చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్ ని ఈ సెప్టెంబర్ 7న విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర సాయంత్రం 5 గంటల నుంచి మొదలు పెట్టనున్నట్టుగా ఖరారు చేశారు. మరి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎవరు వస్తారు అనేవి ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
Get ready to celebrate the magic of #MIRAI in the City of Destiny ❤️????
GRAND PRE-RELEASE EVENT on September 7th at RK Beach, Vizag from 5 PM Onwards ????
IN THEATERS WORLDWIDE ON 12th SEPTEMBER ????
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_… pic.twitter.com/EIh01HhWWF— People Media Factory (@peoplemediafcy) September 5, 2025