మొదటిసారి కొడుకు ఫోటో రివీల్ చేసిన హీరో !

హీరో కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ దంపతులు ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, తాజాగా కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ జంట తమ కొడుకు నామకరణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యులందరి మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. కిరణ్ అబ్బవరం తన కొడుకు ‘హను అబ్బవరం’ అని నామకరణం చేశారు.

కాగా ఈ మేరకు కిరణ్ మొదటి సారి తన కొడుకు ముఖాన్ని కూడా రివీల్ చేశారు. సోషల్ మీడియా వేదికగా కొడుకు పేరును తెలియజేస్తూ ఫొటోను షేర్ చేశారు. ఈ పిక్ చూసినవారంతా.. అబ్బా! బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. అటు కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కూడా ‘జూనియర్ కిరణ్ అబ్బవరం పంచకట్టులో, నుదుటిన నామాలు పెట్టుకొని భలే క్యూట్ గా కనిపిస్తున్నాడు’ అంటూ కామెంట్లు, లైకులు వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version