కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘తిమ్మరాజుపల్లి TV’.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే, ఆయన క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇస్తానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆయన ఓ కొత్త ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

‘తిమ్మరాజుపల్లి TV’ అనే టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడు వి.మునిరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో సాయి తేజ్, వేదశ్రీ, లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడంలో నిర్మాత కిరణ అబ్బవరం సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

Exit mobile version