తెలుగు స్టేట్స్ లో ‘కింగ్డమ్’ ఓపెనింగ్స్ డీటెయిల్స్

Kngdom Collection

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘కింగ్డమ్’. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్లాన్ చేయగా ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ ని ప్రామిస్ చేసింది. ఇలా ప్రస్తుతం తెలుగు స్టేట్స్ మొదటి రోజు వసూళ్లు తెలుస్తున్నాయి. పి ఆర్ లెక్కల ప్రకారం ఏరియాల వారీగా కింగ్డమ్ వసూళ్లు చూసినట్టు అయితే..

నైజాం – 4.20 కోట్లు
సీడెడ్ – 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.16 కోట్లు
తూర్పు గోదావరి – 74 లక్షలు
పశ్చిమ గోదావరి – 59 లక్షలు
గుంటూరు – 75 లక్షలు
కృష్ణ – 59 లక్షలు
నెల్లూరు – 34 లక్షలు

మొత్తం 9.92 కోట్ల షేర్ (జీఎస్టీ కాకుండా) ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఒక సాలిడ్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.

Exit mobile version