‘వార్ 2’ లో కియారా మరో సర్ప్రైజ్.. సాలిడ్ పోస్టర్ విడుదల

‘వార్ 2’ లో కియారా మరో సర్ప్రైజ్.. సాలిడ్ పోస్టర్ విడుదల

Published on Jun 26, 2025 12:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “వార్ 2” అనే చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఇది. అయితే మొన్నామధ్య వచ్చిన టీజర్ తో మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ తన గ్లామర్ షోతో ఒక్కసారిగా మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేసిన సాలిడ్ పోస్టర్స్ లో కియారా నుంచి మరో సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. టీజర్ తో ఆమె కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అనుకుంటే ఇపుడు పోస్టర్ తో తన నుంచి ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి మాత్రం కియారా నుంచి ఇది మరో సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ భారీ చిత్రం రానున్న ఆగస్ట్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు