ప్రభాస్ 21 హీరోయిన్ గా కియారా?


యంగ్ రెబెల్ స్టార్ ఈ ఏడాది ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణంలో దాదాపు 500కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఐతే ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ అంటూ అనేక పేర్లు వినిపించాయి. పాన్ ఇండియా మూవీ కావడంతో దీపికా, కత్రినా వంటి హీరోయిన్స్ ని దర్శక నిర్మాతలు సంప్రదించారని ప్రచారం జరిగింది.

తాజాగా బ్యూటీ కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ కియారా అద్వానీ పట్ల ఆసక్తితో ఉన్నారట. ఇప్పుడిప్పుడే అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న కియారా అద్వానీని తీసుకోవడం మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్ అనుకుంటున్నాడట. తెలుగులో మహేష్ మరియు చరణ్ తో నటించిన కియారా, తెలుగు వారికి కూడా పరిచయమే. కాబట్టి ఆమెను హీరోయిన్ గా తీసుకోవడం కలిసొచ్చే అంశమే.

Exit mobile version