ఆఫర్స్ కోసం అప్పట్లో అంటూ… కియారా చెప్పిన సంగతులు..!

బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో కియారా అద్వానీ దూసుకుపోతుంది. గత ఏడాది ఆమె నటించిన కబీర్ సింగ్ తో ఆమె భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఆ మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాపీస్ దుమ్ముదులిపింది. ఆ మూవీ సక్సెస్ తరువాత బాలీవుడ్ లో కియారాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కి జంటగా లక్ష్మీ బాంబ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే మరో మూడు హిందీ చిత్రాలలో నటిస్తుంది.

ఐతే తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ గా ఎదగడం కోసం కియారా అద్వానీ పడ్డ కష్టాలను తెలియజేసింది. స్వశక్తితో అవకాశాలు దక్కించుకున్నానన్న కియారా అద్వానీ అవకాశాల కోసం అనేక ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేశారట. ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్నాను అని ఆమె చెప్పడం జరిగింది. ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో ఆమె నటించింది.

Exit mobile version