బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మంచి సక్సెస్ అందుకుని చాలా రోజులు అవుతుంది. దీంతో ఆమె సినిమా సెలెక్షన్‌పై కూడా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఆమె చేసిన లాస్ట్ 5 చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ మిగిల్చాయి. ‘జగ్ జగ్ జియో’, ‘గోవిందా మేరా నామ్’, ‘సత్యప్రేమ్ కీ కథ’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలతో కియారా ఫ్లాప్ మూటగట్టుకుంది. అయితే, ఆమె తాజాగా ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె బికినీ షో కోసమే ఉందనే టాక్ వినిపిస్తుంది. ఆమెకు సినిమాలో పెద్ద ప్రాధాన్యత లేని పాత్ర పడిందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాతో కూడా కియారాకు ఏమాత్రం లాభం కలగలేదని వారు అంటున్నారు.
మరి ఇలా వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న కియారా మళ్లీ సక్సెస్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.