“కేజీయఫ్” మేకర్స్ స్పీడ్ పెంచనున్నారా?

“కేజీయఫ్” మేకర్స్ స్పీడ్ పెంచనున్నారా?

Published on Oct 4, 2020 10:10 PM IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం భారీ హిట్ అయ్యేసరికి దీనిపై దాని కంటే ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి.

దీనితో ఈ భారీ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఈ చిత్రం షూట్ కూడా కొన్నాళ్ల పాటు ఆగిపోయి తిరిగి మళ్ళీ మొదలు కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం షూట్ కేవలం కొన్ని కీలక సన్నివేశాలతో మాత్రమే బ్యాలన్స్ ఉంది.

దీనితో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా షూట్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

తాజా వార్తలు