మాస్క్ లేకుండా `కేజీఎఫ్ ‘అధీరా’.. !

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ చాప్టర్- 2`లో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరాగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ లుక్ ను ఇంకా రివీల్ చెయ్యలేదు. తాజగా జూలై 29న ఉదయం 10 గంటలకు మాస్క్ లేకుండా అధీరా లుక్ రాబోతుందని పోస్టర్ ను రిలీజ్ చేస్తూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా సంజయ్ దత్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా పై హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను ఎడిటింగ్ చేశారని, సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమాలోనే సంజయ్ దత్ క్యారెక్టర్ హైలెట్ గా ఉంటుందని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.

ఈ సినిమా మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సిచిత్రం కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. ఆ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే ప్రశాంత్ అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2ల ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌నున్నారు.

Exit mobile version