10 సంవత్సరాల కెరీర్లో కొత్త వాళ్ళతో, స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. దిల్ రాజు ప్రస్తుతం కొత్త వాళ్ళను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి ‘కేరింత’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
దిల్ రాజు ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ ‘ ‘కేరింత’ మూవీతో కొత్త వారిని తెరకి పరిచయం చేయడం కోసం స్టార్ హంట్ నిర్వహిస్తున్నాం. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్చి చివరికల్లా నటీనటుల సెలక్షన్స్ ముగుస్తాయి. ఏప్రిల్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళుతుంది. అలాగే టెక్నీషియన్స్ పరంగా కూడా ఇన్ని రోజులు మా సంస్థలో పనిచేసిన వారికి చాన్స్ ఇస్తున్నాం. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నానని’ అన్నాడు.