మహేష్ తో వర్క్ కోసం వెయిటింగ్ అంటున్న కీర్తి.!

“మహానటి” సినిమాతో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మన దక్షిణాదిలో అన్ని భాషల్లో ఎలాంటి రోల్ అయినా చెయ్యగలిగే హీరోయిన్ గా నిలిచింది. ఒకపక్క స్టార్ హీరోలతో హీరోయిన్ గా మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. అలా ఈరోజు కీర్తి పుట్టినరోజు కావడంతో చాలా మంది సినీ తారలు ఆమెకు విషెష్ తెలిపారు.

అయితే లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన విషెష్ ను కీర్తికి తెలిపి తాము చేస్తున్న “సర్కారు వారి పాట” లోకి వెల్కమ్ తెలిపారు. దీనితో కీర్తి కూడా మహేష్ విషెస్ పై మరియు సినిమాపై కూడా తన స్పందనను తెలిపింది. ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మీతో మొట్టమొదటి సారి సినిమా చెయ్యడం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని తన స్పందనను తెలియజేసింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ కూడా కీర్తీకు హార్టీ వెల్కమ్ చెబుతున్నారు.

Exit mobile version