మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ ఆశించిన రీతిలో అలరించని సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం నిరాశ తర్వాత విజయ్ తన నెక్స్ట్ సినిమాకి రెట్టింపు ఉత్సాహంతో సిద్ధం అయ్యాడు. అలాగే యువ దర్శకుడు రవికిరణ్ కోలా కాంబినేషన్ లో చేస్తున్న చిత్రం కోసం ఆల్రెడీ తన లుక్ అంతా మార్చేయగా ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ కూడా ఉన్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది.
కానీ ఇపుడు ఇది అఫీషియల్ అయ్యింది అని చెప్పాలి. మేకర్స్ లేటెస్ట్ గా కీర్తి సురేష్ సహా హీరో చిత్ర యూనిట్ కలిపి సినిమా ముహూర్త కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనితో దేవరకొండ సినిమాలో మహానటి ఉందనే వార్త నిజమే అని తేలింది. మరి ఈ చిత్రంలో ఆమె ఎలాంటి రోల్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.