స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా నుండి తాప్సీ తప్పుకోవడంతో ఆ స్థానం కోసం హీరోయిన్ ని అన్వేషించారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ అవకాశం కాథెరిన్ ని వరించింది. అల్లు అర్జున్ సరసన అమలా పాల్ తో కలిసి కాథెరిన్ తెర పంచుకోనుంది. ప్రస్తుతం కాథెరిన్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నాని హీరోగా రానున్న ‘పైసా’ మరియు నీలకంఠ దర్శకత్వంలో రానున్న ‘చమ్మక్ చల్లో’ సినిమాల్లో నటిస్తున్నారు.
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 1 నుంచి న్యూజీలాండ్ మరియు ఆస్ట్రేలియాలో జరగనుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ లవ్ స్టొరీలో కోట శ్రీనివాసరావు ఒక పొలిటీషియన్ పాత్ర పోషించనుండగా, షవర్ అలీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.