ప్రేమ కథా చిత్రాలకి హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను అలరించే దర్శకుడు కరుణాకరన్, ఈయన హీరో రామ్ కెరీర్ లో ఖరీదయిన చిత్రాన్ని తెరకెక్కించారు. వీరు ఇరువురి కలయికలో రాబోతున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట”. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర బడ్జట్ 26 కోట్లు. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి పని చేసిన వారందరు పేరొందిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రం అద్బుతంగా తెరకెక్కింది అంటున్నారు. జి.వి.ప్రకాశ్ సంగీతం అందించారు. స్రవంతి రవి కిషోర్ నిర్మించిన ఈ చిత్రం లో తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం మే 11న విడదల చెయ్యడానికి సకలం సిద్దమయ్యింది