కార్తీ ఖైదీకి అరుదైన గౌరవం

గత ఏడాది హీరో కార్తీ మరపురాని విజయం అందుకున్నారు. ఖైదీ పేరుతో విడుదలైన ప్రయోగాత్మ చిత్రం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. తెలుగు మరియు తమిళ భాషలో ఘనవిజయం సాధించిన ఖైదీ మూవీ కార్తీ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కేవలం ఒక రాత్రి నడిచే సన్నివేశాల సమాహారంగా తెరకెక్కించాడు.

ఎటువంటి కమర్షిల్ అంశాలు లేకుండా తెరకెక్కిన ఖైదీ మూవీ అరుదైన గౌరవం అందుకుంది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి, 15 వరకు జరగనుంది. ఈ వేడుకలో ఖైదీ మూవీ ప్రదర్శించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో జరగనున్న ఈ వేడుకలో ఖైదీ చిత్రం ప్రదర్శించనుండడం గొప్ప విషయం అని అంటున్నారు. జెర్సీ చిత్రం కూడా టొరంటో చిత్రోత్సవంలో ప్రదర్శించబడుతుందనే సంగతి తెలిసిందే.

Exit mobile version