యంగ్ హీరో కార్తికేయ, మెగాస్టార్ చిరంజీవి పట్ల తనకున్న అభిమానం తెలుపుకున్నాడు. నిన్న జీ సినిమా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ వేడుకకు వచ్చిన హీరో కార్తికేయ చిరంజీవిని పలకరించారు. ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సంధర్భాన్ని ప్రస్తావిస్తూ కార్తికేయ చిత్ర పరిశ్రమలో తన హార్డ్ వర్క్ నిబద్దతతో ఎందరికో దారి చూపిన స్ఫూర్తి దాత చిరంజీవి గారిని కలవడం జీవితంలో మరచిపోలేని రోజు, ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కార్తికేయ గత ఏడాది మూడు చిత్రాలు విడుదల చేశారు. వాటిలో గుణ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. జయాపజయాలు అటుంచితే హీరోగా కార్తికేయకు మంచి పేరొచ్చింది. నాని హీరోగా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ రోల్ చేయడం జరిగింది.
https://www.instagram.com/p/B7OCfdBHSHZ/