కార్తీక ప్లేసులో బిందు మాధవి!

కార్తీక ప్లేసులో బిందు మాధవి!

Published on Jul 5, 2012 8:59 PM IST


‘అవకాయ్ బిర్యాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బిందు మాధవి ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో మంచి సినిమాలలో నటిస్తోంది అందువల్ల ప్రస్తుతం తెలుగు తెరపై కనిపించడం లేదు.
బిందు మాధవి నటించిన ‘ఖజుగు’ అనే తమిళ చిత్రం ఇటీవలే విడుదలై అందరిచేత మంచి సమీక్షలను అందుకొంది. తాజా సంమచారం ప్రకారం తమిళంలో తెరకెక్కుతున్న ‘సట్టం ఒరు ఇరుత్తారై’ అనే చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేయడానికి అంగీకరించింది.

విక్రమ్ ప్రభు, కార్తీక మరియు పియా బాజ్పాయ్ లు ప్రధాన పాత్రలలో ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విక్రమ్ ప్రభు మరియు కార్తీక ఇద్దరూ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఈ చిత్రంలో కార్తీక పాత్రకి బిందు మాధవి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం తమన్ కుమార్, పియా బాజ్పాయ్, బిందు మాధవి మరియు రీమా సేన్ లు ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోంది. స్నేహ బ్రిట్టో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. విజయ్ ఆంథోని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు