బిర్యాని పూర్తి చేసిన కార్తీ – హన్సిక

బిర్యాని పూర్తి చేసిన కార్తీ – హన్సిక

Published on Jul 21, 2013 12:31 PM IST

Biriyani

తమిళ్ హీరో కార్తీ, బొద్దుగుమ్మ హన్సిక కలిసి నటిస్తున్న ‘బిర్యాని’ సినిమా ఈ సంవత్సరం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రేంజి అమరెన్, మండి తఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ మూవీ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలిపారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని చెన్నై, హైదరాబాద్, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో షూట్ చేసారు. తమిళ్ వెర్షన్ టీజర్ ని కొద్ది నెలల క్రితం రిలీజ్ చేసారు, దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కెఈ జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా స్టొరీ లైన్ గురించి పలు పుకార్లు వినిపిస్తున్నాయి. హీరో బిర్యాని కోసం ఒకే రోజు జరిగే పలు ఈవెంట్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు