బిర్యాని సినిమాతో మరోసారి సక్సస్ రుచి చుసిన నటుడు కార్తీ. తమిళలోనే కాక తెలుగులో కూడా మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం కేథరీన్ సరసన సినిమాకు కాళీ అనే టైటిల్ ను పెట్టారు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కార్తీ మరికొంతమంది నటులతో కలిసి ఇటీవలే చెన్నైలో ఒక వర్క్ షాప్ లో శిక్షణ తీసుకున్నారు. చెన్నైలో ఒక భాగంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అక్కడి సంప్రాదాయాలను అలవరుచుకోవడానికే ఈ శిక్షణ అని తెలిపారు
కేథరీన్ ఈ సినిమాతో తమిళ రంగంలో పాగా వేయాలని బోలెడు ఆశలు పెట్టేసుకుంది. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఈ యేడాదిలోనే ఈ చిత్రం మనముందుకు రానుంది