ఓరియో బ్రాండ్ అంబాసిడర్ గా కార్తీ

ఓరియో బ్రాండ్ అంబాసిడర్ గా కార్తీ

Published on Dec 10, 2013 6:00 PM IST

karthi
బాగా పేరున్న కుకీ బ్రాండ్ ఓరియోకి సౌత్ ఇండియాలో ప్రమోషన్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా తమిళ్ హీరో కార్తీని ఎంపిక చేసుకున్నారు. నార్త్ ఇండియాలో రన్బీర్ కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. కార్తీకి తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లో మంచి క్రేజ్ ఉంది. కార్తీ మీద ఓరియో కోసం తీసిన మొట్టమొదటి ప్రకటన ప్రస్తుతం టీవీల్లో వస్తోంది.

ఇది కాకుండా కార్తీ ‘బిరియాని’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ డిసెంబర్ 6న జరిగింది. డిసెంబర్ 20న ఈ సినిమా ఒకేసారి తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించింది.

తాజా వార్తలు