ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్

ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్

Published on Aug 31, 2025 6:26 PM IST

Ram-Charan-Karnataka-CM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా హ్యాండిల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే పనిలో ఉన్న మేకర్స్ రీసెంట్ గానే సాంగ్ షూటింగ్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సాంగ్ షూట్ మైసూరులో ప్రస్తుతం జరుగుతుంది. మరి ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని కలిసిన పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నేరుగా సీఎం కూడా వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. పెద్ది సినిమా కోసం వచ్చిన పాపులర్ నటుడు రామ్ చరణ్ నేడు కలవడం జరిగింది. ఇద్దరం కొంతసేపు మాట్లాడుకున్నామని పోస్ట్ చేశారు. దీనితో ఈ పోస్ట్ సహా పిక్స్ వైరల్ గా మారాయి.

తాజా వార్తలు