‘కర్మణ్యే వాధికారస్తే’ రిలీజ్ ప్రోమో విడుదల; అక్టోబర్ 31న థియేటర్లలోకి!

‘కర్మణ్యే వాధికారస్తే’ రిలీజ్ ప్రోమో విడుదల; అక్టోబర్ 31న థియేటర్లలోకి!

Published on Oct 28, 2025 8:00 AM IST

Karmanaye-Vadhikaraste

ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘కర్మణ్యే వాధికారస్తే’ చిత్రం రిలీజ్ ప్రోమో తాజాగా విడుదలైంది. బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు.

చిత్రం విడుదల సందర్భంగా, చిత్ర యూనిట్ మాట్లాడుతూ… ‘కర్మణ్యే వాధికారస్తే’ ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ అని తెలిపారు. రోజువారీ జీవితంలో మనం చూసే విద్యార్థి హత్యలు, కిడ్నాప్‌లు, మిస్సింగ్ కేసుల ఆధారంగా ఈ కథను రూపొందించామని వెల్లడించారు. కథాంశానికి అనుగుణంగా బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశారని పేర్కొన్నారు. ఇటీవలే సెన్సార్ సభ్యులు చిత్రాన్ని చూసి ప్రశంసించారని, ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించిందని యూనిట్ తెలిపింది. అక్టోబర్ 31న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు