సూర్య అంటే ఎవరో తెలియదని తాను పలికిన ఒక ఇంటర్వ్యూ నుండి కరీనాకపూర్ సౌత్ లో వార్తలలో నిలిచింది. గజినీ, సింగం హిందిలోకి అనువాదం అయినా తమిళ రంగంలో స్టార్ హీరో సూర్య పేరు కూడా తెలియదా అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేసారు. కరీనా కపూర్, అజయ్ దేవగన్ లు సింగం 2లో నటించిన విషయాన్ని గుర్తుచేశారు
దీనికి ఈ బిబో సమాధానమిస్తూ “నేను సూర్యని కలవలేదు అని చెప్పానే గానీ ఆయన ఎవరో తెలియదని మాత్రం చెప్పలేదు. ఆయన తమిళ సినిమా రంగంలో పెద్ద స్టార్ అని, ఆయన సినిమాలు కొన్ని ఇక్కడ రిమేక్ అవ్వబడ్డాయని నాకు తెలుసు” అని చెప్పింది. సూర్య కొత్త సినిమాలో తాను ఐటెం సాంగ్ ఏమి చేయడం లేదని చెప్పుకొచ్చింది
లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్ సినిమాలో సమంతతో జంటగా నటిస్తున్న సూర్య ముంబైలో షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు