‘అఖండ 2’: స్పీకర్స్ బద్దలు.. ఆడియో డీల్ పూర్తి!?

‘అఖండ 2’: స్పీకర్స్ బద్దలు.. ఆడియో డీల్ పూర్తి!?

Published on Oct 17, 2025 10:00 PM IST

Akhanda2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో డివోషనల్ మూమెంట్స్ తో దుమ్ము లేపుతుంది అని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ చిత్రంకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

గత సినిమాకే థమన్ బాక్స్ లు బద్దలు కొట్టాడు. దీనికి డబుల్, ట్రిపుల్ ట్రీట్ ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అఖండ 2 ఆడియో హక్కులకు సంబంధించి బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం అఖండ 2 ఆడియో హక్కులని మేకర్స్ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక క్లారిటీ కూడా అతి త్వరలోనే రానుంది. ఇక అఖండ 2 ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

తాజా వార్తలు