కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన లేటెస్ట్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా నేడు వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా బుకింగ్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
బుక్ మై షోలో ఈ సినిమాకు గంటలో ఏకంగా 87 వేల టికెట్ బుకింగ్స్ జరుగుతుండటం విశేషం. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా చూస్తున్నారో అర్థమవుతోంది.
ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించాడు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేశారు.