మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ లెజెండరీ సంగీత దర్శకుడు ఉదిత్ నారాయణన్ తో మెగాస్టార్ కోసం మళ్ళీ వింటేజ్ ట్రీట్ ని ప్లాన్ చేయగా మీసాల పిల్ల అంటూ సాగే సాంగ్ తాలూకా ప్రోమోని ఇప్పుడు వదిలారు.
అయితే ఈ సాంగ్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి ప్యూర్ గ్రేస్ అలా డామినేట్ చేసేసింది అని చెప్పాలి. భీమ్స్ ఇచ్చిన సంగీతం, ఉదిత్ నారాయణన్ గారు వోకల్స్ అలా చిరంజీవి తన మార్క్ గ్రేస్ తో స్టెప్పులేస్తుంటే చిరంజీవి ఫ్యాన్స్ కి రెండు కళ్ళు సరిపోనంత ట్రీట్ ఇచ్చేలా కేవలం ఈ కొన్ని సెకండ్ల ప్రోమో లోనే కనిపిస్తున్నాయి.
ఈ ఏజ్ లో కూడా కార్ మీద కూర్చొని అలా తిరగడం ఏంటి, గాల్లో కర్చీఫ్ ని ఎగరేసి స్టెప్ వెయ్యడం ఏంటి.. పూర్తిగా ఇది ఒక్క చిరంజీవి గ్రేస్ కి మాత్రమే సెట్టవుతాయని చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఈ ఫుల్ సాంగ్ అతి త్వరలోనే రిలీజ్ కానుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాబోతుంది.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి