‘బాలయ్య 111’ ముహూర్తానికి డేట్ ఖరారు!


నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు భారీ చిత్రం అఖండ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భారీ అంచనాలు ఇపుడు నెలకొనగా మేకర్స్ ఈ డిసెంబర్ 5 రిలీజ్ కి దీన్ని లాక్ చేశారు. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్ 111వ చిత్రాన్ని తన వీర సింహా రెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్ ఈ దసరా కానుకగా సాలిడ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఈ అక్టోబర్ 24న ఈ మాసివ్ ప్రాజెక్ట్ ముహూర్త కార్యక్రమాలతో లాంఛనంగా మొదలవుతుంది అని ఇపుడు ఖరారు చేశారు. సో బాలయ్య అభిమానులకి ఇది మంచి వార్త అని చెప్పాలి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి కూడా థమన్ సంగీతం అందించనుండగా పెద్ది సినిమా మేకర్స్ వృద్ధి సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version