అక్కడ ‘కాంతార 1’ షోస్ నిలిపివేత!

అక్కడ ‘కాంతార 1’ షోస్ నిలిపివేత!

Published on Oct 1, 2025 11:00 AM IST

Kantara-Chapter-1

ప్రస్తుతం మంచి బజ్ నడుమ పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కన్నడ నుంచి వస్తున్న అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రం కాంతార 1 కూడా ఒకటి. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా రేపు అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. కానీ ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న యూఎస్ మార్కెట్ లో ప్రీమియర్స్ ఎలాగో పడనున్నాయని తెలిసిందే.

కానీ ఇపుడు అక్కడ షోస్ రద్దయినట్టు తెలుస్తుంది. నార్త్ అమెరికా లోని ఐమ్యాక్స్ వెర్షన్ విషయంలో జాప్యం నెలకొనడంతో అక్కడి ప్రీమియర్ షోస్ ఆగినట్టు కన్ఫర్మ్ చేశారు. అందుకే ఎవరూ ఐమ్యాక్స్ షోస్ కోసం వెయిట్ చెయ్యొద్దు అని ఇతర షోస్ ఉంటే వాటిని చూడాలని రికమెండ్ చేస్తున్నారు. మరి ఎప్పుడు నుంచో ప్లానింగ్ లో ఉన్న ఈ సినిమాకి కూడా కంటెంట్ డెలివరీ సమస్యలు రావడం అనేది గమనార్హం.

తాజా వార్తలు